తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ కోడికత్తి కమల్ హాసన్ లా నాటాకాలు ఆడుతున్నాడని చంద్రబాబు అన్న వ్యాఖ్యలకు అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. జగన్… కోడి కత్తి కమల్ హాసన్ కాదు.. భారతీయుడిలో కమల్ హాసన్ అంటూ కొనియాడారు అంబటి రాంబాబు.
భారతీయుడిలో రాక్షసులను అంతం చేసిన కమల్ హాసనే మా జగన్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని, తెలుగు దేశం జెండాలు పట్టుకుని హడావిడి చేశారని ఆయన మండిపడ్డారు.
ప్రజలు మాత్రం ప్రభుత్వం చేసిన సహాయ కార్యక్రమాలు అందాయి అని స్పష్టం చేశారన్నారు అంబటి రాంబాబు.బస్సుల్లో జనాలను తీసుకుని వెళ్లి చంద్రన్న చంద్రన్న అంటు భజన చేయించావుగా.. కాఫర్ డ్యాం కట్టకుండా డ్రయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టాడో చంద్రబాబు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. సెంట్రింగ్ వేయకుండా శ్లాబ్ వేసేశావని, కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నాడు అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.