భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణ పతకం.. సత్తా చాటిన మీరాబాయి

-

బర్మింగ్‌హామ్‌ వేదికగా కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే పలు పతకాలు భారత్‌ ఖాతాలో వేసుకోగా.. ఇప్పుడు తొలి స్వర్ణ పతకం భారత్‌ ఓడిలోకి వచ్చి చేరింది. మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని సాధించింది. 49 కేజీల వెయిట్ విభాగంలో చాను టైటిల్ గెలుచుకుంది మీరాబాయి. స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో 109 కిలోలు ఎత్తింది మీరాబాయి. టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత భారతదేశానికి చెందిన ఈ స్టార్ వెయిట్‌లిఫ్టర్ స్నాచ్‌లో కామన్వెల్త్ గేమ్ రికార్డును మీరాబాయి సృష్టించింది. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీల వెయిట్ విభాగంలో ఈ ఘనత సాధించింది మీరాబాయి. మీరాబాయి స్నాచ్‌లో తన తొలి ప్రయత్నంలోనే 84 కేజీలు ఎత్తింది. రెండో ప్రయత్నంలో 88 కేజీల బరువు ఎత్తి తన వ్యక్తిగత అత్యుత్తమాన్ని సమం చేసింది.

ఈ విభాగంలో స్నాచ్‌ గేమ్స్‌ రికార్డు కూడా ఇదే కావడం గమనార్హం. మూడో ప్రయత్నంలో 90కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మీరాబాయి తన తొలి ప్రయత్నంలోనే క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు ఎత్తి బంగారు పతకాన్ని ఖాయం చేసుకుంది. రెండో ప్రయత్నంలో 113 కేజీలు ఎత్తింది మీరాబాయి. మూడో ప్రయత్నంలో 114 కిలోల బరువును ఎత్తేందుకు ప్రయత్నించినా.. విజయం సాధించలేకపోయింది.టోక్యో ఒలింపిక్స్‌లో స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కిలోలు మీరాబాయి చాను అవలీలగా ఎత్తి స్వర్ణం దక్కించుకుంది మీరాబాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version