తెలుగు మాట్లాడలేని వాడు టీడీపీ వారసుడా..? అని నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి అంబటి. భూగర్భ జలవనరుల డేటా సెంటర్ ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు… మూడు రాజధానులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై సందేహం అవసరం లేదు…వైసీపీ విధానం మూడు రాజధానులేన్నారు.
సమతౌల్యత కోసమే మూడు రాజధానులు.రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయి…వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చాలా పచ్చబొట్లు వేసుకోవాలి. వారాహి ఏది.. ఎక్కడ..? ఆ సినిమా ఆపారా?అవగాహన ఉండి రాజకీయ విమర్శలు చేయాలన్నారు.
మమ్మల్నే ప్రజలు ఆశీర్వదిస్తారనే విశ్వాసం పవన్ కే ఉంది….లోకేష్, పవన్ లకు నిబద్ధత లేదు…లోకేష్ తెలుగు వాడుక భాష మాట్లాడలేడన్నారు. ప్రశాంతత బదులు ప్రశాంతత్త అన్నాడు లోకేష్…తెలుగు మాట్లాడలేని వాడు టీడీపీ వారసుడా..?ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ అని ఏద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుంది….అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఎందుకు లోకేష్ పాదయాత్ర పెట్టామా అని తలలు పట్టుకుంటున్నారన్నారు.