ఇవాళ్టి మ్యాచ్‌ లో SRH దారుణంగా ఓడిపోతుంది – అంబటి రాయుడు

-

ఇవాళ్టి మ్యాచ్‌ లో SRH దారుణంగా ఓడిపోతుందని మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు బాంబ్‌ పేల్చారు. చెన్నైలో జరిగే క్వాలిఫైయర్-2లో రాజస్థాన్ రాయల్స్ పై గెలవడం సన్రైజర్స్ కు కష్టమేనని CSK మాజీ ప్లేయర్ అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. SRHతో పోలిస్తే RR బౌలర్లకు చెన్నై పిచ్ బాగా నప్పుతుందని పేర్కొన్నారు. ‘ఈ మ్యాచ్ లో RR ఫేవరెట్ గా కనిపిస్తోంది. అదేమీ హైదరాబాద్ వికెట్ కాదు. SRH ఆటగాళ్లు మెదడు ఉపయోగించి ఆచితూచి ఆడాలి.

ambati rayudu comments on srh

అక్కడ వికెట్లు తీయడం కష్టం. అందుకే బ్యాటింగ్ తోనే పైచేయి సాధించాలి’ అని సూచించారు. కాగా, IPLలో ఈరోజు కీలక పోరు జరగనుంది. ఫైనల్ కు అర్హత సాధించేందుకు రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తెలపడనున్నాయి. అయితే క్వాలిఫైయర్-2 జరిగే చెన్నై చెపాక్ స్టేడియంలో SRHకు చెత్త రికార్డు ఉంది.అక్కడ సన్రైజర్స్ 10 మ్యాచ్లు ఆడగా ఎనిమిదింటిలో ఓడింది. ఒక మ్యాచ్ గెలవగా మరో మ్యాచ్ టై అయింది. మరి ఈ సెంటిమెంట్ ను కమిన్స్ సేన బ్రేక్ చేసి విజయం సాధిస్తుందేమో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news