వైసీపీపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు !

-

Ambati Rayudu’s sensational comments on YCP: వైసీపీపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి పార్టీలో చేరినా పార్టీలోనే ఆధిపత్య ధోరణి, రాచరికన్ని చూసి అందులో ఉండలేకపోయాను అని మాజీ క్రికెటర్ అంబాటి రాయుడు తెలిపారు. గతంలో తాను వైసీపీ పార్టీలో చేరానని… కానీ అక్కడి వాతావరణం చూశాక ప్రజాసేవకు సరైన వేదిక కాదని అనిపించిందని తెలిపారు. అందుకు వెంటనే పార్టీ వీడానని స్పష్టం చేశారు అంబటి రాయుడు.

Ambati Rayudu’s sensational comments on YCP

పవన్ కళ్యాణ్ నాయకత్వం మరియు ఆశయాలు నాకు బాగా నచ్చాయి… ప్రజలందరూ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు అంబటి రాయుడు. దీంతో అంబటి రాయుడు పై సోషల్ మీడియాలో వైసిపి కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారు. అవసరానికి వైసీపీ పార్టీని వాడుకొని ఇప్పుడు వదిలేస్తున్నాడని మండిపడుతున్నారు. టీమిండియాలో ఇలాగే చేశాడని… ఇప్పుడు రాజకీయాల్లో అదే వ్యవహారం చేస్తున్నాడాని అంబటి రాయుడు పై మండిపడ్డారు వైసిపి కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Latest news