డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం నెలకొంది. కోనసీమ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపుంత రోడ్ లో ఉన్న బుద్ధా స్టాట్యూ ఓం సిటీ లేఔట్ లో సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య నృత్య ప్రదర్శనలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారట. అసభ్య నృత్యాలతో పార్టీ నిర్వహించాడట జనసేన నాయకుడు.
వేలు పూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో డిసెంబరు 31 రాత్రి వేడుకలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ తరుణంలోనే… జనసేన నేతల న్యూ ఇయర్ రేవ్ పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన నాయకుడితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు మండపేట టౌన్ పోలీసులు. అటు జనసేన నేతల పై కేసులు నమోదు చేయొద్దు అంటూ పోలీసులపై ఒత్తిడి కూడా వస్తోంది.