దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని చూడటం కామన్.. పార్టీ అధినేతలైతే.. అధికారం చేతిలో ఉన్నప్పుడే బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తుంటారు.. సహజంగా ఇది రాజకీయాల్లో ఎప్పుడూ జరిగే తంతే.. కానీ ఏపీలో మాత్రం విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయి. పార్టీ అధినేతకు ఇష్టం లేకపోయినా.. కొందరు నేతలు పార్టీలో చేరుతున్నారట.. అవును మీరు చదివింది నిజమే.. క్లారిటీ కోసం ఈ వార్త చూడండి..
తెలుగుదేశం పార్టీతో జతకట్టకముందే పవన్ కళ్యాణ్ దూకుడు ఓ రేంజ్ లో ఉండేది.. వైసీపీ మీద తీవ్రమైన విమర్శలు చేసేవారు.. సింగిల్ గా పోటీ చేసి అధికారంలోకి వస్తామని చెబుతుండేవారు.. చివరికి బిజేపీ, టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీగా కొనసాగుతున్నారు.. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ లో మార్పు వచ్చిందట.. సీఎం చంద్రబాబు డైరెక్షన్ లోనే నడుస్తున్నారని.. పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. పార్టీలో చేరే నేతల విషయంలో కూడా చంద్రబాబు చెప్పినట్లే చేస్తున్నారట..
ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోపే ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి జనసేన తీర్దం పుచ్చుకున్నారు.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్దులు జనసేనలోకి క్యూ కడుతున్నారు.. వీరి చేరికల వెనుక చంద్రబాబు ఉన్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీని బలహీన పరిచేందుకు చంద్రబాబే వారిని జనసేనలో చేర్పిస్తున్నారట.. నేరుగా టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబుకు కొన్ని ఇబ్బందులున్నాయి.. అలా అని వారు వైసీపీలో ఉండకూడదు.. దీంతో వారిని జనసేనలో చేర్చితే వైసీపీ బలహీన పడుతుందని చంద్రబాబు ఆలోచనగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వైసీపీలో అసంతృప్తిగా ఉండేవాళ్లందిరనీ జనసేనలోకి పంపితే… వచ్చె ఎన్నికల్లో కూడా వారు జనసేన లేదంటే టీడీపీ నుంచేటిక్కెట్ వస్తుందని.. తద్వారా వైసీపీని దెబ్బకొట్టొచ్చని చంద్రబాబు భావిస్తున్నారట.. మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యనేత గంజి చిరంజీవిని కూడా జనసేనలోకి పంపింది చంద్రబాబేనన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. నారా లోకేష్ కు మంగళగిరి నియోజకవర్గం కంచుకోటగా మారాలంటే చిరంజీవి లాంటోళ్లు తమ వైపే ఉండాలని చంద్రబాబు భావించారట..
ఇలా వైసీపీలో ఉండే కీలక నేతలందరినీ జనసేనలోకి పంపేలా చంద్రబాబే ప్లాన్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.. కొందరిని పార్టీలో చేర్చుకోవడం పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం లేదని.. కానీ చంద్రబాబు సూచనల మేరకు చేర్చుకోవాల్సి వస్తోందని పవన్ కళ్యాణ్ సన్నిహితులు గుసగుసలాడుతున్నారు.. చూడాలి.. భవిష్యత్ లో ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉంటుందో..