దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. దీంతో దావోస్ పర్యటనకు రెండు రాష్ట్రాల సీఎంలు వెళ్లడంపై కొత్త చర్చ మొదలైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో 5 రోజులు మకాం వేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు దావోలో 3 రోజులు దావోస్ లో ఉంటారు. అంతర్జాతీయ పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాలతో ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రేవంత్, చంద్రబాబు దావోస్ పర్యటనలు కొనసాగనున్నాయని అంటున్నారు. అయితే వీరిద్దరూ కలిసి దావోస్ పర్యటనలో పాల్గొంటారా ? అనే కొత్త చర్చ మొదలైంది. రెండు రాష్ట్రాల సీఎంలు కలిసే దావోస్ పర్యటన ప్లాన్ చేసుకున్నారా ? అని అందరూ అంటున్నారు. ఇద్దరు సీఎంల పర్యటనలపై సోషల్ మీడియాలో ట్రోల్ కూడా వస్తున్నాయి.