మహిళలకు ఫ్రీ బస్సుపై…రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఫ్రీ బస్సును ఖచ్చితంగా అమలు చేస్తామని… కాస్త సమయం ఉందన్నారు. రేపటి నుంచి రెండురోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారని వివరించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారని క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్, సినీ నిర్మాత నాగ వంశీ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ… తనపై,తన పిఏపై వస్తున్న ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తప్ప జరిగి ఉంటే తప్పులు ఉందని చెప్పాలని… ఎవరి లైఫ్ స్టైల్ వారిదన్నారు. ప్రభుత్వానికి,వ్యక్తిగత చెడ్డపేరు వచ్చే పనులు చేయబోమన్నారు. అలాంటి ఆరోపణలను పట్టించుకోము….పట్టించు కావాల్సిన అవసరం లేదుని వెల్లడించారు. వైసిపి నేతలు మంత్రుల పిఏల విషయంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని… ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని… నూతన పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు.