వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరం జనవరి 1 న జీతాలు రావాలి..ఉపాధ్యాయులకు ఇంకా జీతం లేదని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారన్నారు. ఏడు నెలల్లో ఏ ఒక్క హామీ అమలయ్యేలా లేదని… ఉద్యోగుల పని వాతావరణం మెరుగు పరుస్తాం అన్నారు..ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా అంటూ నిలదీశారు.
ఉద్యోగులకు గౌరవం లేకుండా చేస్తోంది ఈ ప్రభుత్వమని… గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులతో తెల్లవారుజామున చీకట్లో పెన్షన్ పంపిణీ చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. మహిళా ఉద్యోగులను ఇబ్బందికర పరిస్థితి లోకి నెడుతున్నారన్నారు. ఉద్యోగుల కు ఐఆర్ ఇస్తామన్నారు…ఇప్పటికి ఎలాంటి ప్రకటన లేదు….పిఆర్సీ ఇవ్వడం తర్వాత ..కనీసం పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చెయ్యండని డిమాండ్ చేశారు.