Anam Ramanaraya Reddy : నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో వివాదం జరిగింది. నాగుల వెల్లటూరు గ్రామంలో టిడిపి నేతల ప్రచారాన్ని అడ్డుకున్నారట వై.సి.పి.నేతలు. దీంతో వైసిపి, టిడిపి నేతల మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం.

అంతేకాదు… మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు పై దాడి కూడా జరిగినట్లు సమాచారం. అటు ఈ సంఘటనలో ఆత్మకూరు టిడిపి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి..కింద పడిపోయారని సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.