వైసిపి నేత, టాలీవుడ్ యాంకర్ శ్యామల కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు యాంకర్ శ్యామల. బెట్టింగ్ యాప్ కేసులో తనమీద నమోదు అయిన ఎఫ్ ఐ ఆర్ ను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు యాంకర్ శ్యామల. అయితే శ్యామల పిటిషన్ పైన ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.

బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకుగాను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో యాంకర్ శ్యామలపై కేసు నమోదు అయింది. ఆంధ్ర 365 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్ కు యాంకర్ శ్యామల ప్రమోషన్ చేసింది. ఈ తరుణంలోనే.. యాంకర్ శ్యామలపై కేసు నమోదు అయింది.