రూ.20 వేలు లంచం తీసుకుంటూ స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కారు. ఓ ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.దీంతో సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణపై బాధిత వ్యక్తి అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించినట్లు తెలిసింది.
దీంతో అధికారుల సూచనల మేరకు సదరు వ్యక్తి రూ.20వేలు లంచం ఇవ్వగా సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అనంతరం ఆయన్ను విచారించినట్లు తెలిసింది.ఆ తర్వాత స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఆయన్ను తరలించినట్లు తెలుస్తోంది.