తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసనలు తెలుపుతున్నారు.రోజుకో అంశంపై నిరనస వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవితతో పాటు నిరసన తెలిపారు.
‘అప్పులు ఘనం అభివృద్ధి శూన్యం’ అంటూ ప్లకార్డులు పట్టుకుని అప్పులు ఆకాశంలో..అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు చేశారు. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 58 వేల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ.2,500 ఇచ్చారు? ఎంత మంది వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇచ్చారు? ఎంత మందికి తులం బంగారం ఇచ్చారని నిలదీశారు.