Andhra Pradesh : వాహనదారులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మినీ సరుకు రవాణా వాహనదారులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వార్షిక జీవిత పన్ను స్థానంలో త్రైమాసిక పన్ను విధానాన్ని వారి విజ్ఞప్తి మేరకు అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

దీనితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లక్షకు పైగా ఉన్న మినీ సరుకు రవాణా వాహనాలకు ఊరట దక్కనుంది. ఈ నిర్ణయంతో ఇకపై ఒకేసారి మొత్తం పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా…. ఏడాదికి నాలుగు వాయిదాలలో పన్ను చెల్లించవచ్చు.