వైసీపీ నుంచి కోటంరెడ్డి సోదరుడి తొలగింపు

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి వైసీపీ పార్టీ మరో షాక్‌ ఇచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన YCP సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు YCP ప్రకటించింది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు క్రమశిక్షణ కమిటీ అందించిన సిఫారసుల మేరకు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్వయానా తమ్ముడు.