తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. తిరుమలలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే రెండు నెలల్లో శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బుక్ లేట్లను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తో కలిసి శ్రీవారి ఆలయం ఎదుట ఆవిష్కరించారు.
ఈ ఏడాది అధికమాసం కారణంగా సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. అయితే.. ఈ ఉత్సవాల నేపథ్యంలోనే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి. దీంతో సామాన్య భక్తులకు శ్రీ వారి దర్శనం ఈజీగా జరుగనుంది.