భారత్ ఆతిత్యం ఇస్తున్న జీ-20 సదస్సు ప్రగతి మైదానంలో భారత మండపంలో అట్టహాసంగా ప్రారంభం అయింది. ప్రపంచ దేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. అనంతరం తన ప్రసంగంతో మోడీ సదస్సును ప్రారంభించారు. మొరాకాలో సంభవించిన భూకంపంపై స్పందించారు మోడీ. ఈ సంఘటన చాా విచారకరమన్నారు.
భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. మొరాకోకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
జీ-20లో కొత్త దేశానికి సభ్యత్వం ఇచ్చారు. ఆఫ్రికన్ యూనియన్ కి సభ్యత్వం ఇచ్చింది జీ20. ఆప్రికన్ యూనియన్ సభ్యత్వానికి భారత్ మద్దతు ప్రకటించింది. జీ20లో ఇప్పటివరకు 19 దేశాలు, యురోపియన్ యూనియన్ దేశాలున్నాయి. ఇప్పుడు 19 దేశాలతో పాటు ఆప్రికన్ యురోపియన్ యూనియన్లున్నాయి.ఈ ఏడాది సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఆఫ్రికన్ యూనియన్ ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో హాజరైంది.