డిఫెన్స్ రంగంలో ఏపీకి రానున్న అతి పెద్ద ప్రాజెక్ట్

-

డిఫెన్స్ రంగంలో అతి పెద్ద ప్రాజెక్ట్.. ఏపీకి రానునుంది.సత్యసాయి జిల్లా పాల సముద్రంలో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు BEL గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిసైల్స్ తయారీకి.. రాడార్ టెస్టింగ్ కోసం ఏర్పాటు చేయబోయే భారీ ప్రాజెక్టుకు రూ. 384 కోట్లు మంజూరు చేశారు. బందరులోని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – ఇన్వెస్ట్మెంట్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ పార్థసారధి అధ్యక్షతన సమావేశంలో నిధుల మంజూరు జరిగింది.

ఇక ఈ సందర్భంగా బెల్ డైరెక్టర్ పార్ధసారధి మాట్లాడుతూ, మిసైల్స్ తయారీ, రాడార్ల టెస్టింగ్ కోసం పాల సముద్రం దగ్గర 914 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలం సేకరించామన్నరు.మరిన్ని అత్యాధునిక రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసే – డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ గా దీన్ని పెద్దగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.

 

ఏపీఐఐసీతో భూమి అప్పగింత కోసం సంప్రదింపుల జరిపాం.. కొన్ని రోజుల క్రితమే క్లియరెన్స్ వచ్చింది.బెల్ ఆధ్వర్యంలో రక్షణ రంగ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. వెనుకబడిన రాయల సీమ ప్రాంతానికి ఇది ఒక ఆశాకిరణమవుతుంది.ఫ్యాక్టరీ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి పని మొదలు పెడతామని, ప్రతి 6 నెలలకు పనుల పురోగతిపై సమీక్షిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version