అప్పికొండ బీచ్ యువతి కేసులో మరో ట్విస్ట్..!

-

విశాఖలోని అప్పికొండ బీచ్ సముద్ర తీరంలో ఓ అమ్మాయి పడిపోగా.. స్థానిక మత్యకారులు రక్షించి సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ యువతి కాలికి బలమైన గాయాలు కావడంతో కెజిహెచ్ కు తరలించారు. యువతిపై మచిలిపట్నం ఇనుగుదురుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 29న మిస్పింగ్ కేసు నమెదు అయింది. ఫణీంద్ర వర్మ రాజు అనే యువకుడితో గత నెల 29న విశాఖకు వచ్చారు.

A young woman stuck between rocks in Appikonda beach

గోపాలపట్నం నాయుడు గార్డెన్ లాడ్జిలో ఉన్నారు. ఈ నెల 2న అప్పికొండ శివాలయంకు వచ్చి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత అరకు వెళ్లి అక్కడ కొద్ది రోజులు ఉన్నారు. ఈ నెల 8న మళ్లీ  అప్పికొండ శివాలయం వద్దకు వచ్చారు. అక్కడే శివాలయం వద్ద దర్శనం చేసుకోని వస్తున్న సమయంలో సముద్రంలో అమ్మాయి కాలు జారీ పడిందని యువతి స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదని చేప్పింది. ఇనుగుదురుపేట పోలీసులు సెట్మెంట్ రికార్డు చేసుకున్నారు. యువతిని కెజిహెచ్ నుండి డిశార్చ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. మరోవైపు ఆ యువతి వద్ద ఉన్న డబ్బులు, బంగారం తీసుకొని వర్మరాజు పారిపోయినట్టు సమాచారం. కేసు ఇనుగుదురుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version