ఇండియా కు గుడ్ న్యూస్: గిల్ డిచ్చార్జ్ అయ్యాడు… కానీ అందుకు డౌటే !

-

వరల్డ్ కప్ లో కీలక ప్లేయర్ గా ఇండియా జట్టులో ఉన్న శుబ్మాన్ గిల్ అనారోగ్యం కారణంగా మొన్న జరిగిన ఆస్ట్రేలియా తో మ్యాచ్ లో దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అయినా కోలుకుని మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడేమో అని అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ కలిగేలా ఉంది. చెన్నై లో ఉండగా డెంగ్యూ ఫీవర్ కారణంగా ప్లేట్ లెట్స్ దారుణంగా పడిపోవడంతో అక్కడే హాస్పిటల్ లో అర్జెంటు గా చికిత్స తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా బీసీసీఐ నుండి అందుతున్న సమాచారం ప్రకారం శుబ్ మాన్ గిల్ కు ప్లేట్ లెట్స్ సమస్య తీరిపోయి కొంచెం పర్వాలేదు అని చెబుతున్నారు. ఇది నిజంగా ఇండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పాలి.

కానీ ఈ బలహీనతతో అప్పుడే మ్యాచ్ ఆడే పరిస్థితి ఉండబోదన్నది డాక్టర్స్ అభిప్రాయం. రేపు ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్ ఉండగా.. ఆ తర్వాత మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ లకు కూడా గిల్ అందుబాటులో ఉండే అవకాశం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version