ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా… ఏపీ ప్రజల పరిస్థితి మరింత దారుణ స్థితులకు వెళ్ళినట్టు చెబుతున్నారు. తాజాగా ఏపీ ప్రజలకు అండగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. ఉన్నపలంగా నిలిపివేశారు అధికారులు.
ఇవాల్టి సాయంత్రం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి అసోసియేషన్ ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటి నుంచే ఈ హెచ్ ఎస్, అలాగే ఓపి సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటన చేసింది హాస్పిటల్ అసోసియేషన్. చంద్రబాబు కూటమి ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 26వ తేదీ నుంచి అత్యవసర సేవలు కూడా బంద్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన 3000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ… ఈ నిరసనకు దిగింది హాస్పిటల్ అసోసియేషన్. మరి దీనిపై చంద్రబాబు కూటమి సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.