ఇవాళ్టితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. గత 5 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి శాసన సభ, మండలి సమావేశాలు. ముఖ్యంగా ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టనున్నారు. మూడు అంశాల పై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరుగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు లో అక్రమాల పై షార్ట్ డిస్కషన్ ఉంటుంది.
ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యల పై స్వల్ప కాలిక చర్చ జరుగనుంది. ప్రశ్నోత్తరాల సమయంతో పెద్దల సభ ప్రారంభం అవుతుంది. ఈ తరుణంలోనే మొదటగా సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు మండలి ముందుకు రానుంది. అటు స్కిల్ స్కాం పై రెండవ రోజు చర్చ కొనసాగనుంది. వైద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి పై స్వల్ప కాలిక చర్చలు జరుగనున్నాయి.దీంతో అసెంబ్లీ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ తీర్మానం చేయనుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.