AP: ఈ నెల 24వ తేదీన కెబినెట్ సమావేశం

-

ఆంధ్ర ప్రదేశ్‌ కేబినేట్‌ సమావేశానికి ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 24వ తేదీన కెబినెట్ సమావేశం జరుగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు తొలి కెబినెట్ సమావేశం నిర్వహించనుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కెబినెట్లో కీలక చర్చ జరుగనుంది. మొత్తం ఎనిమిది శాఖలపై శ్వేత పత్రాల విడుదలపై కెబినెట్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

AP Cabinet meeting on 24th of this month

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేక ప్రస్తావన రానుందని సమాచారం. ఇప్పటికే ఏపీకున్న అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది కొత్త ప్రభుత్వం. రూ. 14 లక్షల కోట్లపైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి వచ్చిన సమాచారం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపై కెబినెట్లో కీలక ప్రస్తావన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version