రాష్ట్రాన్ని మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తామని కూటమి పార్టీలుగా మేం హామీ ఇచ్చాం. మేం ఇచ్చిన హామీలకు అనుగుణంగానే మేం పని చేస్తున్నాం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరాన్ని తిరిగి ట్రాక్ లో పెట్టగలిగాం. పోలవరం పూర్తి అవుతుందనే నమ్మకం ఇప్పుడు కలిగింది. కేంద్రం ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్రానికి అభినందనలు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది.
ఏపీలో ఉపాధి కల్పించడం, ఆర్థిక పరిస్థితి ట్రాక్ లో పెట్టడంలో కేంద్రం సహకరిస్తుంది. ఇవాళ ఏపీకి శుభ దినం.. శుభ పరిణామం. గోదావరిలో మునిగిన పోలవరాన్ని మళ్లీ గట్టు పైన పెట్టాం. కేంద్ర కేబినెట్ నిధులు ఇవ్వడానికి అంగీకరించడం సంతోషదాయకం. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇదికొంత వెసులుబాటు. జాతీయ ప్రాజెక్టు గా గుర్తించే ముందు ఏపీ ఖర్చు చేసిన 4730 కోట్లును రాష్ట్ర వాటా గా పరిగణించారు. 25760 కోట్లు మిగిలిన మొత్తం లో ఇప్పటికీ 15,146 కోట్లు ఇవ్వాలి. 12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది . ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధానికి మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి, జలవనరుల శాఖ మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు.