జన్వాడ ఫిరంగి నాల వద్ద అధికారుల సర్వే..!

-

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ ఫామ్ హౌస్ వద్ద ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. వరుసగా రెండవ రోజు జన్వాడ ఫిరంగి నాల వద్ద సర్వే చేపట్టారు అధికారులు. మొత్తం ఆరుగురు అధికారులు బృందంగా ఏర్పడి సర్వే చేస్తున్నారు. అయితే ఫిరంగి నాల పరిధిలోనే ఫార్మ్ హౌస్ ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు రెండవ రోజు సర్వే చేపట్టడంతో మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది.

ఫిరంగి నాలా మొత్తం 20 మిటర్స్.. బఫర్ జోన్ 9 మిటర్స్ ఉండాలి. కానీ ప్రస్తుతం 2 మిటర్స్ లో కొనసాగుతుంది నాలా. దాంతో ఫిరంగి నాలా అనుకొని ఎలా ఫామ్ హౌస్ నిర్మించారు.. ఫిరంగి నాల ఎంత మేర కబ్జాకు గురైంది FTL అలాగే బఫర్ జోన్ ఎంత వరకు ఉంది. నిబంధనలు అతిక్రమించి ఫామ్ హౌస్ ఎలా నేర్పించారు ఆమె ఆధారాలు సేకరిస్తున్నారు రెవిన్యూ ఇరిగేషన్ బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version