12వ తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారం.. గెస్టులు వీళ్లే

-

ఏపీలో ఈ నెల 11వ తేదీన టీడీఎల్పీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రిగా చంద్రబాబుని ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత గవర్నర్కు నివేదిక పంపనున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం 12వ తేదీన ఉండనుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతల్ని ఆహ్వానిస్తున్నట్లు బుచ్చయ్య తెలిపారు.

ప్రధాని ప్రమాణ స్వీకారంతో పాటు ఒడిశా ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు వెళ్తారని వెల్లడించారు. బాబు ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీ పార్లమెంటరీ భేటీ తర్వాత, మరోసారి ఎన్డీఏ నేతల సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎన్డీఏ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరుకావాలని నిర్ణయించారు. ఎల్లుండి రాష్ట్రపతి ముర్మును కలిసి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అందులో భాగంగా ఈ నెల 9న ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news