ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది మనం ముస్లింలను దూదేకులు అని పిలుస్తూ ఉంటాం. ముస్లిమ్స్ లో దూదేకుల వారు తక్కువ స్థాయి వారు అన్నమాట. అయితే దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.

దూదేకులను కులం పేరుతో దూషిస్తే శిక్ష తప్పదని తాజాగా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఆ కులం పై అభ్యంతరకర పదాలను నిషేధిస్తూ జీవో జారీ చేసింది ఏపీ సర్కార్. దూదేకులోడా, పింజారి, పింజారోడా, సగం సాయిబు లాంటి పదాలను వినియోగించరాదని స్పష్టం చేసింది జగన్ సర్కార్. వారిపై ఈ పదాలను ప్రయోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.