ఏపీలో కొత్తగా 4,605 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి కాస్త పెరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 4605 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2293171 కి పెరిగింది.

కోవిడ్ వల్ల అనంతపురం , కడప మరియు కర్నూలు లలో ఇద్దరు, చిత్తూరు, గుం టూరు, ప్రకాశం మరియు విజయనగరంలలో ఒక్కొక్క రు చొప్పు న మరణించారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 641 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 93488 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 11,729 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2185042 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 30,578 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,25,71,365 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version