వికసిత్ ఏపీ డాక్యుమెంట్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కామెంట్స్..!

-

అక్టోబరు 2 తేదీన వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించేలా కార్యాచరణ చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేస్తాం. 2047 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఏపీని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ నెల 28న జరిగే మంత్రి మండలి సమావేశంలో విజన్ డాక్యుమెంట్ 2047 ను ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్నాము.

అయితే సెప్టెంబరు 1 నుండి 15 వరకూ విజన్ డాక్యుమెంట్ పై ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాల సేకరిస్తాం. సెప్టెంబరు 10-15 మధ్య మండల, మున్సిపల్, గ్రామస్థాయి అవగాహనా సదస్సులు నిర్వహిస్తాం. వచ్చేనెల 10-14 మధ్య ఉన్నత పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్ధులకు పోటీల నిర్వహణ ఉంటుంది. సెప్టెంబరు 15-24 మధ్య ఏపీ విజన్ 2047 ముసాయిదా ఖరారు చేస్తాం. సెప్టెంబరు 25న వికసిత్ ఏపీ విజన్ 2047 తుది ముసాయిదా సమర్పిస్తాం అని నీరబ్ కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version