ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు కీలక ప్రకటన చేశారు. వైసీపీ నేత సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఉందని వెల్లడించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు. ఒక కేసులో గుంటూరు ఎస్పీ ఎల్ఓసీ జారీ చేశారని వివరించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు. ఆ కేసుకు సంబంధించి సజ్జలని డీటెయిన్ చేసే అవకాశం ఉందన్నారు.
కల్తీ నెయ్యి కేసులో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వ వేలిన సిట్ ను అభిశంసించ లేదని తెలియ జేశారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు. ఈ సిట్ నే ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక fssai అధికారి ఉండాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఐజీ త్రిపాఠి, డిఐజీ జెట్టి గోపినాథ్ పేర్లను పంపించామన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు. అది స్వతంత్ర విచారణ.. అందులో రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.