ఈ నెల 18న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. టీడీపీ పార్టీ బలోపేతం, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ ఉంటుందని సమాచారం. మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు మరోసారి స్పష్టం చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే మద్యం షాపు యజమానులను బెదిరించిన పలువురు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు.
