ఏపీ గురించి చెప్పాలంటేనే బాధగా ఉంది : కేంద్ర మంత్రి షెకావత్

-

ఏపీ గురించి చెప్పాలంటేనే బాధగా ఉందంటూ కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయి నీరు అందించేందుకు ఉద్దేశించిన జల్‌జీవన్‌ మిషన్‌ అమలులో ఆంధ్రప్రదేశ్‌ పనితీరు సరిగా లేదని తెలిపారు. సోమవారం రోజున రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు షెకావత్ బదులిచ్చారు.

2021 తర్వాత కేంద్రం ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు పైసా కూడా ఉపయోగించుకోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని అత్యంత దుఃఖంతో ఈ సభ దృష్టికి తెస్తున్నానని షెకావత్ పేర్కొన్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వాటానూ సమకూర్చలేదని వివరించారు. ఇది కచ్చితంగా ఆందోళనకర స్థితి అని తెలిపారు. వారితో నిరంతరం సంప్రదిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటివరకు దేశంలో తెలంగాణ, దాద్రానగర్‌హవేలీ, దామన్‌దయ్యూ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, గోవా, గుజరాత్‌, హరియాణ రాష్ట్రాలు తమ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు కుళాయిని అందుబాటులోకి తెచ్చాయి. మహారాష్ట్ర (77.44%), మణిపుర్‌ (76.63%), నాగాలాండ్‌ (73.07%) తర్వాతి స్థానాల్లో ఏపీ (70.05%) ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version