ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. కృష్ణానది వరద ఉధృతి పెరుగుతోంది. ఈ తరుణంలో తుంగభద్ర డ్యామ్ వద్ద కనిపించకుండా పోయింది గేట్ నెంబర్ 19. చైన్ లింక్ తెగిపోవడంతో కొట్టుకుపోయింది గేట్. ఈ గేట్ నుంచి సుమారు 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం జరుగుతోంది.
మొత్తం 48 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల అవుతున్నాయి. దీంతో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… అత్యవసర సహాయంకోసం టోల్ ఫ్రీ 1070,112, 18004250101 సంప్రదించండని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… కాలువలు వాగులు దాటే ప్రయత్నం చేయరాదని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.