The car hit the tipper lorry: హైదరాబాద్ లోని నార్శింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీని ఢీ కొట్టింది ఓ కారు. కారు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటూ స్థానికులు చెబుతున్నారు. మై హోమ్ అవతార్ సర్కిల్ వద్ద తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఇక కారులో ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు టిప్పర్ లారి డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యారు.

గంట పాటు శ్రమించి గాయపడ్డ వారిని కారు లోంచి బయటికి తీశారు పోలీసులు. గాయపడ్డ వారిలో ముగ్గురు ఇంజనీర్స్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి నుండి నార్సింగ్ మై హోమ్ అవతార్ మీదుగా ప్రయనీస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.