ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ డీఎస్సీ ప్రకటనకు రంగం సిద్ధమైంది. సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నిరుద్యోగుల కోసం డీఎస్సీ ప్రకటన చేయబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు మంత్రి నారా లోకేష్.
ఇప్పటికే డీఎస్సీ వయోపరిమితిని 42 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచింది కూటమి ప్రభుత్వం. ఇక ఇవాళ మెగా డీఎస్సీ… పోస్టులను కూడా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో జిల్లాస్థాయిలో… 14,088 పోస్టులు కాగా స్టేటస్ జోన్ లెవెల్ 2259, సెకండరీ టీచర్ గ్రేట్ ఖాళీలు 65 99 ఉన్నాయి. 13 ఉమ్మడి జిల్లాల సబ్జెక్టుల వారిగా ఖాళీలు కూడా ఉన్నాయి.