ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బర్త్డే ఇవాళ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడుకు.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి. ఆయన నిండు నూరేళ్లు… జీవించాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ పెట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అటు చంద్రబాబు కు చిరంజీవి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు . దార్శనికత, కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకులు మీరు.ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు 75 వ జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
Happy Birthday to @Ncbn Garu! Wishing you a peaceful and healthy long life!
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2025