AP DSC Hall Ticket Download 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీఎస్సీ ఎగ్జామ్కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మెగా DSC-2025కి సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి.

డీఎస్సీ అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి.. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెగా DSCకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది.
మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించాడు. జూన్ 6వ తేదీ నుంచి మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. టీచర్స్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్‌కు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు ఉండాలని సూచనలు చేశారు.