పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో వచ్చే ఫిబ్రవరి 10వ తేదీన ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదల చేసే దిశగా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తోందని సమాచారం అందుతుంది. ఆ దిశగా ముహూర్తం కూడా ఖరారు అయినట్లు చెబుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సమాచారం కూడా వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
2019 సాధారణ ఎన్నికలకు సంబంధించి మార్చి మూడవ తేదీ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. 2024 సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు గత ఎన్నికల కంటే 20 రోజులు ముందుగానే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని… తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ తో పాటు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది అన్నమాట. ఇక ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో వైసిపి పార్టీ ఇప్పటికే అభ్యర్థుల వేటలో పడింది. ప్రతిరోజు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం అవుతూ కీలక చర్చలు చేస్తున్నారు. అటు టిడిపి మరియు జనసేన పార్టీల మధ్య పొత్తు కూడా దాదాపు ఖరారు అయిపోయింది.