ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు పరిధిలో కర్ణాటక నుంచి యానాం వెళ్తున్న శ్రీతులసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద వర్షానికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది.
బస్సులో 39 మంది ప్రయాణికులు ఉండగా.. ఓ మహిళ మృతి, డ్రైవర్ తో సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక అటు ములుగు జిల్లా… మేడారం అమ్మవార్లను దర్శించుకునీ వస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో బొలెరో వాహనం బోల్తా కొట్టి ప్రమాదం చోటు చేసుకుంది.
ఏటూరునాగారం (మం) చిన్నబోయినపల్లి, తాడ్వాయి మధ్యలో ఎదురుగా వస్తున్న ఇసుక లారినీ తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది బొలెరో ట్రాలీ వాహనం.ఇక ఈ బొలెరో వాహనంలో 20 మంది భక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో చదలవాడ రమణ (50) మృతి చెందగా, మరో 13 మంది ప్రయాణికులకు తీవ్రగాయలు అయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హుటహుటీన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు.