ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పై కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దీపావళి రోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం లంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో… కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది ఏపీ సర్కార్.
దీని ప్రకారం… దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభం కానుంది. గ్యాస్ కనెక్షన్ తో పాటు… రేషన్ కార్డ్ అలాగే ఆధార్ కార్డులు చూపిస్తేనే ఈ పథకం కింద అర్హులవుతారని తెలిపింది. మొదటగా పూర్తి సొమ్ము చెల్లిస్తే రెండు రోజుల తర్వాత ప్రభుత్వం లబ్ధిదారుని ఖాతాలో… డబ్బు మళ్లీ తిరిగి జమ చేస్తుంది. అక్టోబర్ 31వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు… సిలిండర్ కి అయ్యే ఖర్చు 895 కోట్ల రూపాయల చెక్కును… చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారు.