అమరావతిలో ఏపీ ప్రభుత్వం మిషన్ మోడ్..!

-

అమరావతిలో భవనాలను పునః ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం మిషన్ మోడ్ లోకి వచ్చేసింది. డిసెంబర్ 15 నుండి బిల్డింగ్ యాక్టివిటీ కిక్‌స్టార్ట్ కానుంది. ఎంపిక చేసిన కొన్ని కన్‌స్ట్రక్షన్ మేజర్‌లకు వివిధ ప్రాజెక్ట్ వర్క్‌ల ప్రదానం చేయనున్నారు. పాత కాంట్రాక్టులను రద్దు చేసి తాజాగా బిడ్‌లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. సాధ్యమైనంత పాత కాంట్రాక్టర్ ల తోనే పని జరిపించాలని నిర్ణయం తీసుకుంది. బిడ్డింగ్ ప్రక్రియకు అధికారిక గడువు త్వరలో ముగియగానే ఎంచుకున్న సంస్థలకు వర్క్ ఆర్డర్‌లు జారీ చేసింది. ఎంఎల్ఏ లు, AIS అధికారుల హౌసింగ్ ప్రాజెక్ట్ చేసిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీకే మరలా కాంట్రాక్ట్ ఇవ్వనుంది.

హ్యాపీ నెస్ట్, గెజిటెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ పనులను చేయడానికి ఎన్‌సిసి ఎంపిక చేసింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నిబంధనల ప్రకారం “హై రిస్క్ ప్రాజెక్ట్”గా NGOల హౌసింగ్ మొత్తం ఖర్చు 1872.74 కోట్లు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్\ADB నుండి నిధులు కోరింది APCRDA. మరో నిర్మాణ ప్రధానమైన KMV ప్రాజెక్ట్స్‌కు IAS అధికారుల బంగ్లాల నిర్మాణాలకు తిరిగి అవార్డు ఇవ్వనుంది. BSR ఇన్‌ఫ్రా నే న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల పనికి మళ్లీ ఎంపిక చేయనుంది. APCRDA డిసెంబర్ 15 నుంచీ ప్రాజెక్ట్‌ల కోసం టైమ్‌లైన్‌లను రూపొందించింది ఎంఎల్ఏలు, AIS ఆఫీసర్స్ క్వార్టర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎన్జీవోస్ క్వార్టర్స్, జడ్జీలు, మంత్రులు, AIS ఆఫీసర్ల బంగ్లాల నిర్మాణాలు డిసెంబర్ 15, 2024న ప్రారంభం కానున్నాయి. ఈ ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లు అన్నింటికీ ఖర్చు 1,132.71 కోట్లు పెరిగింది. NGOల గృహాల ప్రతి sft ధర 3,061 నుండి 4,410కి పెరిగింది. గెజిటెడ్ ఆఫీసర్ల ఫ్లాట్ల విషయంలో, ఒక్కో sft ధర 3,255 నుండి 4,556కి పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news