మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

-

మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఏటా నష్టపోతున్న మామిడి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాలిపోయిన, దెబ్బతిన్న మామిడికాయలను కొని పౌడర్ తయారు చేసే ప్రాసెసింగ్ యూనిట్ రూ.5 కోట్ల వ్యయంతో ఏలూరు జిల్లా నూజివీడులో ఏర్పాటు చేయనుంది.

ఈ పరిశ్రమలో వెయ్యి మంది మహిళలకు రూ. 50 లక్షలతో భాగస్వామ్యం కల్పించింది. మిగతా మొత్తాన్ని సబ్సిడీ ఇవ్వనుంది. దీనివల్ల ఏలూరు, కృష్ణాజిల్లాల రైతులకు లబ్ధి చేకూరనుంది. కాగా, చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను సీఎం జగన్ నేడు ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేస్తారు. ఒక్కో ఆటో విలువ రూ.4.10 లక్షలు కాగా, 500 కేజీల సామర్ధ్యంతో వీటిని రూపొందించారు. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 21.18 కోట్లను వెచ్చించింది.

Read more RELATED
Recommended to you

Latest news