అంగన్‌వాడీల నిరసనపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పందించారు. అంగన్‌వాడీ సంఘాలను చర్చలకు పిలిచింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అంగన్‌వాడీ సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపనుంది. గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వానికి, అంగన్వాడీలకు మధ్య పీటముడి తెగలేదు.
జీతాల పెంపు, గ్రాట్యుటీ పై పట్టుబడుతున్నారు అంగన్వాడీలు. తెలంగాణ కంటే ఎక్కువ జీతం లేదా మినిమం పే స్కేలు 20 ఇవ్వాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు డిమాండ్ల పై సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం. గత చర్చల అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకసారి పరిశీలిద్దాం. అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల సేవల విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అంగన్‌వాడీ వర్కర్లకు, సహాయకులను వర్కర్లుగా ప్రమోట్ చేసే వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచింది సర్కార్. అంగన్‌వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీసు విరమణ తర్వాత ఒన్ టైం బెనిఫిట్ రూ.50 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచారు. అంగన్‌వాడీ సహాయకుల సర్వీసు విమరమణ తర్వాత ఒన్‌టైం బెనిఫిట్ రూ.40వేలకు పెంచారు.