విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లాంతర్ ర్యాలీ నిర్వహించిన షర్మిల..!

-

పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లాంతర్ పట్టుకొని ఇందిరాగాంధీ సర్కిల్ వరకు లాంతర్ ర్యాలీ నిర్వహించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెరిగిన ఛార్జీలతో ప్రజలు ఇక అంధకారంలో బ్రతకాలి. లాంతర్లు కొనుక్కోవాలి. వైసీపీ హయంలో 35 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని అమలు చేస్తుంది. ఇప్పటికే 17 వేల కోట్లు భారాన్ని మోపారు. వైసీపీకి కూటమి కి తేడా ఏమీ లేదు. అడిగితే ఇది వైసీపీ చేసిన పాపం అంటున్నారు. ఇదెక్కడి న్యాయం.

4 రూపాయలు పడే యూనిట్ ధర 8 రూపాయలు పెట్టరాట. అక్రమంగా హిందూజా లాంటి కంపెనీలకు చెల్లించారట. తప్పు జగన్ చేస్తే ప్రజలపై భారం ఎందుకు.. ప్రజలు ఆ భారాన్ని ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నించారు. ఇప్పటికే ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో 4.80 పైసలు యూనిట్ ధర ఉంటే.. ఆంధ్రలో యూనిట్ కి 6 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సర్దుబాటు చార్జీలు పేరుతో 40 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రజలు మీకు ఓట్లు వేసింది వైసిపి మీద వ్యతిరేకత తోనే. ఇపుడు మీరు భారాన్ని మోపడం అన్యాయం అని షర్మిల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version