మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ.. రెండు మిల్లులు సీజ్..!

-

గుంటూరు జిల్లాలో మేడికొండ మండలం పేరే చెర్ల గ్రామంలో మూడు రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసారు రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్. ఆయనతో పాటుగా పౌర సరఫరా అధికారులు.. జాయింట్ కలెక్టర్ తదితరులు ఉన్నారు. అయితే రైస్ మిల్లు ప్రాంతంలో రేషన్ సప్లై చేసే వాహనాన్ని దాచి ఉంచిన వైనాన్ని చూసి ఆశ్చర్యపోయిన మంత్రి… ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని మిల్లును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇక పేరే చెర్ల నందు మంత్రి రాకను ఊహించి వెంకటేశ్వర రైస్ మిల్ ప్రాంగణంలో సీఎంఆర్ రైస్ బ్యాక్ టాగ్లను దహనం చేసారు రైస్ మిల్ నిర్వాహకులు. అయితే రైస్ బాగ్ ట్యాగ్ల దహనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. రైస్ మిల్ సిబ్బందిని అదుపులోకి తీసుకోవాలని… పంచ నామ నిర్వహించి.. కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక గుంటూరు జిల్లాలో విఘ్నేశ్వర రైస్ మిల్లు తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్.. టార్చ్ లైట్ వెలుగులో రైస్ మిల్లులో బియ్యం, రికార్డులు అలాగే 26 కేజీల బియ్యం బస్తాల తూకంను పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version