వరదల్లో దెబ్బతిన్న రోడ్ల కోసం మొత్తం 376 కోట్లు రిలీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం..!

-

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అదే విధంగా రహదారుల్లో ప్రధాన సమస్యగా ఉన్న పాత్ హోల్స్ పూడ్చేందుకు మరో రూ.290 కోట్లు కూడా మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులు ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా ఆర్వోబీల పూర్తికి భూసేకరణ కోసం అవసరమైన రూ.42 కోట్ల నిధుల విడుదలకు కూడా అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో రూ.65 వేల కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రతి మూడు నెలలకు ఎంత పని పూర్తి చేయగలం అనేది మదింపు చేసుకుని టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై రివ్యూ చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలోమంత్రి బిసి జనార్థన్ రెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version