రీచుల నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం. మెగా డీఎస్సీ, అన్న క్యాంటిన్లు తదితర వాటిని తీసుకొచ్చింది. తాజాగా ఉచిత ఇసుక, రూ.99కే మద్యం అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ముఖ్యంగా రీచుల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.  గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు  మాత్రమే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం. ప్రస్తుతం ట్రాక్టర్లకు కూడా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం స్థానిక అవసరాల నిమిత్తమే ట్రాక్టర్లల్లో ఇసుకను తీసుకెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ట్రాక్టర్లలో తీసుకెళ్లిన ఇసుకను అవసరాలకు కాకుండా ఎక్కడికైనా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version