పార్టీ ఇమేజ్ కి ఇబ్బంది రావద్దు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 26వ తేదీ నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించామన్నారు. సాధారణ సభ్యత్వ రుసుము ఎప్పటిలాగా రూ.100 ఉంటుందని.. ఈ ఏడాది నుంచి కొత్తగా లైఫ్ టైం సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నాం.. దీని రుసుము
రూ.1,00,000 గా నిర్ణయించామన్నారు. మెంబర్ షిప్ ఉన్న వారు చనిపోతే అందించే ఇన్సూరెన్స్ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామన్నారు. చనిపోయిన కార్యకర్తలకు రూ.10 వేలు మట్టి ఖర్చులు ఇస్తామన్నారు.
గతంలో ఇన్స్యూరెన్స్ రాని 73 మందికి రెండు లక్షల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ప్రమాద బీమా కింద ఇప్పటి వరకు రూ.102 కోట్లు, సహజ మరణం, ఇతర సమస్యలకు రూ.18 కోట్లు సాయంగా అందించామన్నారు. విద్యార్థుల చదువు కోసం రూ.2 కోట్ల 35 లక్షలు అందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. లీడర్, క్యాడర్, ఎంపవర్మెంట్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా అవినీతి మరక లేకుండా క్యాడర్ ను ఆర్థికంగా నిలబెట్టే ఆలోచనలు చేస్తున్నామన్నారు. పార్టీ కోసం పని చేసిన నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇఛ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రతీ ఎమ్మెల్యే తమ నియోజకవర్గాలలో ఈ తరహాలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. టీడీపీకి ప్రత్యేక క్రమశిక్షణ ఉంది.. మనకు ఒక ఫిలాసపీ ఉందన్నారు.