కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో జిల్లాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ఏడాదిపాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా కాలం ముగిసిపోగా.. వారి సేవలను 2026 ఏడాది మార్చి 30 పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే సేవల పొడిగింపు వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్.. కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకానికి ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో పాటు జిల్లాలలో వందలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న విషయం విధితమే.